ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 14, మండలవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్132.వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధనకల్ గ్రామంలో ఎంపిటిసి రమచంద్రారెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ డా. బీ.ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ను అంటరానివాడిగా చూసేవారు. పాఠశాలకు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లోనే కూర్చోనిచ్చేవారు కాదు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిస్ట్గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం కొనియాడారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాజేశ్వరి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, రవీందర్ గౌడ్, అధికారులు, వార్డ్ మెంబర్ వెంకటి, గ్రామస్తులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
