ప్రాంతీయం

సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి – సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య

135 Views

డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. రాయపోలు మండలం అనాజపురం గ్రామంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర మహాసభలు మొదటిసారిగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలకు జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కేరళ కార్మిక శాఖ మంత్రి శివం కుట్టి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. కార్మిక సమస్యలు చర్చించి రాబోయే కాలానికి ప్రణాళికా ఈ మహాసభల్లో రూపొందించడం జరుగుతుందని అని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేయడం జరిగిందని నూతనంగా కార్మిక కోడెల రూపొందించారని దీనితో కార్మికులకు నష్టదాయకం ఏర్పడుతుందని కార్పొరేట్ యజమానులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. గ్రామపంచాయతీ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని తరగతుల ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని హమాలీ, ఆటో ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణం, బీడీ తదితరంగాల కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు మల్లేశం, బాలమణి, సైదులు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found