Breaking News

సర్పంచ్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అం

113 Views

తనపై వస్తున్న అసత్య ఆరోపణలు ఖండించిన ధర్మారం గ్రామ సర్పంచ్ అరుణ*
*టీఆరెస్ పార్టీ సర్పంచ్ కానందుకే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు*
ప్రజాపక్షం/ కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం,గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్, గ్రామపంచాయతీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని తనపై తన భర్త పై అసత్య ప్రచారాలు చేస్తూ టీఆరెస్ ఉప సర్పంచ్,కొందరు వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ మహిళా సర్పంచ్ అని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామంలో ప్రభుత్వ నుండి వచ్చిన ప్రతి పని చేస్తూ మండలంలో ముందుగాపనులు చేసిన సర్పంచ్ గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నానని నా భర్త పై నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వివాదాల్లోకి లాగి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంతేకాకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులు అయినటువంటి సిసి రోడ్లు స్మశానవాటికలు డంప్ యార్డులు ఇజిఎస్ పనులు మొదలగు వాటిని వారికే తీర్మానాలు చేసి అప్పచెప్పిన వారు ఏ మాత్రం చేయలేదని గ్రామపంచాయతీ లోని అనవసరపు ఖర్చులు చేయకుండా నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి జీపికి వచ్చే నిధులతో నిధి ఏర్పాటు చేసి ఖర్చు చేయకుండా నూతన గ్రామపంచాయతీ నిర్మాణాo చేయాలని చూస్తే కావాలని దురుద్దేశంతో వారి మాటలతో నా యొక్క మనోభావాలను దెబ్బ తీస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఉపసర్పంచ్ వార్డు సభ్యుల రాజీనామాలు అధికారులు ఎలాగూ ఆమోదించారని తెలిసి రాజీనామాలు చేశారని అంతేకాకుండా గ్రామంలో జరిగే పాలకవర్గ సమావేశాలకు సభలకు వార్డు సభ్యులు ఎన్నోసార్లు రాలేదని ఇండిపెండెంట్ సర్పంచిగా ఉండి గ్రామం ఎంతో అభివృద్ధి చేస్తుంటే కావాలనే ఉద్దేశంతో అధికార పార్టీ సభ్యులు మండల నాయకులు జిల్లా నాయకులు ప్రోద్బలంతో టిఆర్ఎస్ గ్రామ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు మాపై కక్ష గట్టి లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పాలక వర్గ సభ్యులకు గ్రామాభివృద్ధి పై ప్రేమే ఉంటే వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేయాలని లేకపోతే గ్రామంలో అసత్య ఆరోపణలు మానుకొని గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తన భర్త గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించినట్లు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని వాటిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్