తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రం ములుగులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే రోల్ మోడల్ గా తయారు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేసే సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రైతులు అప్పుల ఊబి నుండి ఇప్పుడు ఇప్పుడే ఆర్థికంగా కోరుకుంటున్నారని ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం చాలా దారుణం. రైతుల గోస కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదన్నారు. రైతులను నడ్డి విడిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం, బిజెపి పార్టీ మోటార్లకు మీటర్లు పెడతామని రైతుల నోట్లు మట్టి కొట్టే విధంగా ప్రతిపక్షాలు తీరుతాయని చెప్పారు. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు యూరియా దొరకక డిఏపీలు దొరకక విత్తనాలు దొరకక కరెంటు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు చాలా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకున్న గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేదన్నారు.





