ప్రాంతీయం

చేబర్తి లో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

139 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో మంగళ వారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ, జాలని యాదగిరి,కనకరాజు, గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల కమిటీ మండల ఆర్గనైజర్ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, మర్కుక్ సర్పంచ్ భాస్కర్,పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయుడని విద్యతోనే అన్ని సాధ్యమని ఎంతోమందికి విద్యా దానం చేసి గొప్ప కీర్తి పొందిన జ్యోతిబా పూలే అడుగు జాడల్లో నడవాలని,ఆకాంక్షించారు, మహనీయుల ఉత్సవాల కమిటీ కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి,కార్యదర్శి సిద్ధేశ్వర్,వార్డ్ సభ్యులు బాల నర్సయ్య, కో ఆప్షన్ సభ్యులు గుడాల శేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి, ప్రభుత్వ పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,నర్సింలు,నాయకులు గణేష్,శ్రీకాంత్,దాసు,శ్రీనివాస్, శెమ్మని భాస్కర్, నర్సింగరావు,రాంబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *