టీ ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం
బీఎస్పీ గజ్వేల్ నాయకులు
సిద్దిపేట జిల్లా టీఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని , చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ,రద్దు చేసిన పరీక్షలు నిష్పక్షపాతంగా జరపాలని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని,తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కమిటీ పిలుపు మేరకు ఛలో కలెక్టరేట్ లో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ నాయకులు అరెస్ట్ చేసి II టౌన్ పోలీసు స్టేషన్ తరలించడం జరిగింది.గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్, నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ , ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్,కొండపాక మండల నాయకులు అందే భూపాల్, కుకునూర్ పల్లి మండల అధ్యక్షులు ఆశని కనక ప్రసాద్ ,తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సెక్టార్ నాయకులు స్వామి, అనిల్, కర్ణాకర్, కుమార్ లను అరెస్ట్ చేయడం జరిగింది.ఇందులో నాయకులకు గాయాలు అయ్యాయి.అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరని టీఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేసి ,తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని మరింత ఉదృతంగా చేస్తామని ,త్వరలో మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని జిల్లా కార్యదర్శి నరేష్ హెచ్చరించాడం జరిగింది
