తొగుట: రోడ్డు ప్రమాదంలో పెద్దమసాన్ పల్లికి చెందిన వెల్దండి లక్ష్మి గారు మరణించడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమసాన్ పల్లిలో ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించి, ఆమె కుమారుడు ప్రశాంత్, కుమార్తె మౌనికలను పరామర్శించి, ఓదార్చారు… మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..రూ.4000 ఆర్ధిక సహాయం అందించారు. రైతు బీమా ద్వారా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లక్ష్మి భర్త లింగం కూడా తీవ్రంగా గాయపడడం జరిగిందన్నారు. పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కంది రాంరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు మెట్టు వరలక్ష్మి స్వామి, మాష్ఠి సుమలత కనకయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్, నాయకులు పన్యాల ఎల్లారెడ్డి, కొల కనకయ్య, తాళ్ల నర్సింలు, కనకయ్య తదితరులు ఉన్నారు
