ప్రాంతీయం

సెస్ ఎన్నికల బరిలోకి అవకాశం ఇస్తే…

157 Views

 ముస్తాబాద్ డిసెంబర్ 9, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సెస్ ఎలక్షన్లలో భాగంగా ముస్తాబాద్ మండలానికి సంభందించి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరుపున నాపేరు ప్రతిపాదించాలని జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోల కృష్ణ గౌడ్ ప్రస్తుతం నాకు అప్పగించిన మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతను మండలంలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలను కలుపుకొని ప్రతి సమస్యలపై అలాగే రాష్ట్ర పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలను మండలంలో పలురకాలుగా నిర్వహించడంలో నాపాత్రను విజయవంతంగా నిర్వహించాను.. రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి నా వంతుగా కృషి చేస్తానని.. అలాగే త్వరలో సిరిసిల్ల జిల్లా పరిధిలో జరిగే సెస్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని చేర్మన్ స్ధానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found