Breaking News

కార్మికుడు సత్తా చాటాడు

176 Views

టెట్ ఫలితాలలో జి హెచ్ ఎం సి

కార్మికుడు సత్తా చాటాడు

హైదరాబాద్: సెప్టెంబర్ 27

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హయత్ నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు.

బీఏ, బీఈడీ, ఎంఏ తెలుగు చదివిన నరేష్ ఉద్యోగం రాకపోవటంతో హయత్ నగర్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా టెట్‌కు ప్రిపేరై తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా,

ఈ నెల 15న తెలంగాణవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు,84.12శాతం, పేపర్‌-2కు 1.90 (91.11 శాతం, లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీ ఆర్ టీ ) జరగనుంది…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *