నిరుపేదలకు ఆపద వస్తే నేనున్నానంటూ వారి కళ్ళలో వచ్చే కన్నీటిని తుడవడమే మా ప్రథమ కర్తవ్యమని, పేద ప్రజలకు సేవ చేయడంలో వెనుకాడమని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం సుల్తాన- ఉమర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా గౌరవ అధ్యక్షులు దార మల్లయ్య భార్య దుర్గమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే ఎంతో విషాదకరంగా ఉంటాయని మిడిదొడ్డి మండల కేంద్రానికి చెందిన కొండా వెంకటేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని, వారికి భార్య లక్ష్మి ముగ్గురు కూతుర్లు నవనీత, మానస, శ్వేత ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. యజమాని మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడ్డారు.దానితో వారు పెద్దదిక్కు కోల్పోయారు. ఆ ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు, చదువులు ప్రశ్నార్థకంగా మారినయి. వారి పోషణ లక్ష్మికి తలకు మించిన భారంగా మారింది. తమ వంతు సహకారం ఈ కుటుంబానికి అందించడం జరిగిందని, ఇంకా మానవతావాదులు ఎవరైనా కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అలాగే దార దుర్గమ్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని,వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, తెలంగాణ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, జిల్లా కార్యలయ కార్యదర్శి చంద్రం, మండల అధ్యక్షులు దార స్వామి,మాజీ సర్పంచ్ రోశయ్య, సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్,రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, స్థానికులు స్వామి, కిరణ్, కుమార్, చంద్రం, మహేష్, యాదగిరి, చంద్రం తదితరులు పాల్గొన్నారు.




