గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రామమణి 60000, మరియు నరసవ్వ 36,000 చెక్కులను బాధితులకు అందజేసిన 19 వ వార్డు కౌన్సిలర్ గుంటూకు శిరీష రాజు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నుండి చెక్కుల మంజూరుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. పేదవారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక వరం అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితులలో సతమవుతున్న వారికి ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక భరోసా అన్నారు.
