మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని FCA ఫంక్షన్ హాల్ లో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్, సబ్ జూనియర్, యూత్ లేవల్ బాల, బాలికల టైసన్ కప్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు హాజరయ్యారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ పోటిల్లో క్రీడాకారులు తలపడ్డనున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను క్రీడారంగంలో రాష్ట్ర స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే జిల్లాలో అన్ని క్రీడలు ఒకే వేదికగా నిర్వహించేందుకు ఇండోర్ స్టేడియం ను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఆటవిడుపు కోసం క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వాహకులు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వివిధ జిల్లాలకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
