మర్కుక్ నుండి భవనందపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నం – వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు
మర్కుక్ మండల కేంద్రము నుండి భవానందపూర్ వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని వెంటనే మరమ్మత్తులు చేయాలని మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పుట్ట కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరకు మండల కేంద్రం నుండి భవానందాపూర్ వెళ్లే దారి పూర్తి గుంతల మయంగా మారిందని వాహనదారులు ప్రమాద బారిన పడుతున్నారని అధికారులు వెంటనే ఈ రోడ్డున మరమ్మతు చేయాలని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు దగ్గరలో కొండపోచమ్మ డ్యాం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రాంతం రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులకు ప్రమాద భరితంగా మారిందని ఎంతోమంది ప్రమాదాలకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయని ఏంటని రోడ్లు మరమ్మత్తు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్లాలని ఆకాశించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సురేష్, నాయకులు సుర్వి నాగేంద్రబాబు, పోకల రవి,అశోక్,స్వామి,యాదగిరి,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు





