సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాటికొండ కృష్ణ తల్లిదండ్రులు ఒకటే నెలలో ఇద్దరు మరణించడం చాలా బాధాకరమని ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలుకల్ ఎంపిటిసి వెంకటయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ రావు, యూత్ నాయకులు తుప్పతి ప్రవీణ్, తుడుం ప్రశాంత్, తుప్పతి కుమార్, రతన్, శ్రీనివాస్, నర్సింలు, రమేష్ తదితరులు ఉన్నారు.
