ప్రాంతీయం

అ’పూర్వ’ సమ్మేళనం

216 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1991-92 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాడు విద్యార్థులు నేర్పిన గురువులు లింగారెడ్డి, చారి, ఆది నర్సింలు, రాజిరెడ్డి, రామ్మూర్తి, రాంరెడ్డి, రాజేశంలను సన్మానం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేస్తున్న మిత్రులందరికీ తమ వివరాలను ఒకరితో ఒకరు పంచుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గంప రవి, జక్కుల చంద్రం, సిద్ధిరాములు, ఆనందం, కృష్ణ, శంభు ప్రసాద్, వేణు, నర్ర నర్సింలు, సత్యం తదితరులు పాల్గొన్నారు……

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7