తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం లో పనిచేసే డాటా ఎంట్రీ ఆఫీసర్స్ గా పని చేసే ఉద్యోగులు, ఆయా జిల్లాలోని కలెక్టర్స్, ఎమ్మెల్యే, డి ఎం హెచ్ ఓ ఆఫీసర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.
అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు డేటా ఎంట్రీ ఆఫీసర్ నోటిఫికేషన్ రాకపోవడంతో హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, మరియు ఆయా డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 1500కు పైగా కంటి వెలుగు ప్రోగ్రాం లో డాటా ఎంట్రీ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు ప్రోగ్రాం దేశంలో ఎక్కడా లేని విధంగా సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించబడుతుంది.
శుక్రవారం వరకు జరిగిన కంటి వెలుగు ప్రోగ్రాం లో కంటి పరీక్షలు కోటికి చేరువలో ఉన్నాయి, రాష్ట్రంలో 60 శాతం స్క్రీనింగ్ పూర్తయింది. 96 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తికాగా, 50 లక్షలకు పైగా మహిళలకు కంటి పరీక్షలు జరిగాయి.
దేశం గర్వించదగిన కంటి వెలుగు కార్యక్రమం ఇది. ఆయా రాష్ట్రాల వారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా కంటి వెలుగు ప్రోగ్రాం నిర్వహించదలిచినారు.
ఇంతటి సమర్థవంతమైన విజయవంతమైన కంటి వెలుగు ప్రోగ్రాం లో పనిచేసే డాటా ఎంట్రీ ఆఫీసర్స్ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిఇఓస్ గురించి ఆలోచించి, వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఏ డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు అయితే ఉన్నాయో వాటి స్థానంలో నియమించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.