ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె గ్రామంలో గ్రామ దేవతలకు ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ దేవతలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అత్యంత వైభోపీతంగా తీశారు బైండ్ల పోతరాజుల నృత్యాలు ఆటపాటలతో శివసత్తుల శిగాలతో అమ్మవారికి బోనాలు తీసి నైవెద్దం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు బోనాలు తీసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని వారన్నారు. అలాగే గ్రామంలోని పాడిపంటలు పండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని పిల్లా పాపలు అష్టైశ్వర్యాలతో గ్రామాన్ని చూడాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
