బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లక్ష్మను బిఆర్ఎస్ పార్టీలో చేరాలని ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడడం జరిగిందన్నారు అంతే కాకుండా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొంతమంది మహిళలు సోమవారం పార్టీ కార్యాలయంలో చేరగా వారిలో సంఘ నిర్మలను బెదిరించి మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి రావాలని బెదిరించడం జరిగిందన్నారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వార్డు సభ్యుడు మల్లేషమును బలవంతంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి తాను గతంలో అనారోగ్యానికి గురికాగా ఆ డబ్బులు చెల్లిస్తామని ప్రలోభాలకు గురి చేయడం జరిగింది అన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ నాయకులు భూపాల్ రెడ్డి నరసింహులు సురేందర్ దేవరాజు శ్రీ పాల్ రెడ్డి చెన్ని బాబు రవి రఫీక్ తదితరులు పాల్గొన్నారు
