భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు సుధాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి, దయానంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ గౌడ్, బిక్షపతి, ఐలయ్య, లింగం, మ్యాకల బిక్షపతి, శ్రీరాంరెడ్డి, ప్రవీణ్, మహేందర్ రెడ్డి, అనంతం, కృష్ణమూర్తి, కనకయ్య, ఈశ్వర్, పరశురామ్, ఆంజనేయులు, ఉపాధ్యాయుడు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
