ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించాలన్నదే
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. వ్యవస్థలో అవినీతి జాడ్యం వలన జరిగే పరిణామాలు గురించి రోజు చూసినవారే. ఉద్యోగం రాక మునుపు ఉద్యోగం రావాలని ఎంతోమంది దేవాన దేవతలకు మొక్కుతుంటారు. తీరా ఉద్యోగం వచ్చాక పని భారం తక్కువ ఉండాలని, జీతం ఎక్కువ ఉండాలని, బోలెడు సెలవలు రావాలని, చేసే ఉద్యోగం ఊరిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. కొద్దీ రోజుల తరువాత ప్రక్కదారి త్రొక్కుతూ అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. నేడు అవినీతికి ఆకర్షితులై నిజాయితీ కోల్పోతున్నారు. నిజాయితీపరునికి ఉన్న ఆదరణ, అవినీతి పరునికి ఉండడం లేదు. నిజాయితీపరుడు నేను అవినీతిపరున్ని కాదని గర్వంగా చెప్పుకోగలడు. అవినీతిపరుడు నేను నిజాయితీ పరుడు అని చెప్పుకునే ధైర్యం అతనికి ఉందా… చెప్పుకోనికే ధైర్యం చాలడం లేదే మరి చేయి చాచడం ఎందుకు ఇప్పటికైనా అవినీతి పాల్పడే ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించేలా ఆలోచిస్తారని అనుకుంటున్నాను.
