Breaking News

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది

214 Views

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *