తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20
మంగపేట మండలం కమ లాపురం గ్రామంలో ఈవియం వివిప్యాట్ విని యోగం పై ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.20 సెప్టెంబర్
నుండి వచ్చే నెల 4 వ వరకు మంగపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఈవియం వివిప్యాట్ వినియోగం పై ఓటరులకు అవ గాహన కల్పించే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఈవియం వివిప్యాట్ డెమోన్ స్టేషన్ వాహనంతో ప్రతీ గ్రామానికి వెళ్లి ఓటు వేసే విధా నం పై అవగాహన కల్పిస్తారని తాసిల్దార్ విర స్వామి తెలి పారు.ఈ ప్రారంభ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్,డి టీ మల్లేశ్వర రావు.రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.