జగదేవపూర్ మండలంలోని ఆలిరాజ్ పేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీమతి M. నీలారాణి, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయసస్య రక్షణ అధికారి వారిచే రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్క జొన్న మరియు ఇతర రబీ పంటలపై సమగ్ర సస్యరక్షణ కేంద్రం పద్ధతులను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం ఆఫీల్డ్ డే ప్రోగామ్ ను నిర్వహించి 30 మంది రైతులకు ఉచితంగా సిపియమ్ కిట్స్ మరియు మొక్కణాన్ని సమగ్ర సస్వంతం పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ. శేషారెడ్డి : డిప్యూటి డైరక్టర్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంఎఒ వసంత్ రావు, ఎఇఒ శరణ్య, నిర్మల్ నగర్ సర్పంచ్ శ్వామల రాజు, ఉపసర్పంచ్ రమేష్, రైతులు , A. సత్తిరెడ్డి. రామబాద్రారెడ్డి, బాపరెడ్డి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.