ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది వరం లాంటిదని గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని దౌలపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిదికీ దరఖాస్తు చేయగా వారికీ రాగుల అంజయ్య కు రూ.49000/-వేలు,జూపల్లి లలిత కు రూ.15000/-వేలు, జిల్లెల సుమంజలి కి రూ.13000/-వేలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం లబ్ధిదారులు ఉపేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు సీఎం సహయనిది వరంగా మారిందన్నారు.
గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు వైద్య సేవల కోసం సీఎం సహయనిది కార్యక్రమాలు చేపట్టలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్
పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాస్కర్, మాజీ అధ్యక్షులు నారాయణ, నాయకులు నర్సింలు, అశోక్, కనకయ్య, జె.రాములు తదితరులు పాల్గొన్నారు.
