*కుమరం భీమ్ అడ ప్రాజెక్టును పట్టించుకోని ప్రభుత్వం.. బిజెపి*
*కొమరం భీమ్ అడా ప్రాజెక్టును పరిశీలించిన బిజెపి నాయకుల బృందం*
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్*
*ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్*
*కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం 10 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన కుమ్రంభీం అడ ప్రాజెక్ట్ ప్రమాదపుటంచులో ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొమురంభీం అడ ప్రాజెక్టు ను వర్షంలో బిజెపి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతు డిక్లరేషన్ పేరుతో సాగునీటి ప్రాజెక్టులు రైతులను అభివృద్ధి చేస్తామని చెప్పినా కోట్లాది రూపాయలు వెచ్చించి 10 క్యూసెక్కుల నీటి సామర్థ్యం గల ఆసిఫాబాద్ జిల్లాలోని 45,500. వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఆడ గ్రామంలో పెద్ద వాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అధికారులు దీని ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నిరుడితో పోలిస్తే ఆనకట్టకు వంద మీటర్ల వరకు బీటలు వారి, పగుళ్లు తేలి మరింత కుంగింది. ప్రాజెక్ట్ పరిస్థితి ఆందోళనకరంగా మారినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రిపేర్ల కోసం ఒక్క పైసా ఇవ్వకపోవడంపై మండి పడ్డారు. మరింత కుంగిపోకుండా కేవలం 5 లక్షల రూపాయలు కేటాయించి కట్టపై పాలిథీన్ కవర్లు కప్పి పగుళ్లు కనిపియ్యకుండా చేస్తున్నారని అన్నారు.అయితే ఇప్పటివరకూ రిపేర్లు చేయకపోవడంతో గట్టివానలు కొడితే అడ ప్రాజెక్ట్ మనుగడ కష్టమేనని అయన అన్నారు.పగుళ్లు తేలి ఏడాది గడుస్తున్నా, కట్టకు’ రిపేర్లతో పాటు కెనాల్స్, పిల్ల కాల్వలు పూర్తి పూర్తి చేయకుండా పోవడంతో ఒక ఎకరాకు కూడా నీళ్లు అందించలేని దుస్థితి నెలకొన్నది కేవలం మూడు క్యూసెక్కుల నీటిని మాత్రమే ఉంచి మిగతా ఏడు క్యూసెక్కుల వరద నీటిని గత రెండు సంవత్సరాలుగా వృధాగా వదిలి వేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ హామీకి కట్టుబడి ఆడా ప్రాజెక్ట్. వట్టి వాగు. జగన్నాథపూర్. మరియు తుమ్మిడేటి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రణాహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఈ జిల్లాను సస్యశ్యామయం చేయాలని అన్నారు లేనిపక్షంలో టిఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అన్నారు ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుల్బం చక్రపాణి
జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ. నాయకులు బొమ్మెన ప్రసాద్ గౌడ్ పెంటన్న రుకుం ప్రహ్లాద్ పోషన్న . గడ్డల. సురేష్. అయిలవేని సంతోష్. కోట వెంకన్న. కోట గొల్ల. సచిన్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు*
