మహిళల అభివృద్దే దేశాభివృద్ధి…
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు,మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన మహిళలను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ NC రాజమౌళి గుప్తా..మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తామెక్కడ తక్కువ కాదని అత్యధికంగా దేశాభివృద్ధిలో దూసుకుపోతున్నామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజమౌళి గుప్తా అన్నారు…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో మున్సిపల్ చైర్ పర్సన్ రాజమౌళి గుప్త అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సమయపాలనతో క్రమశిక్షణ కలిగి నిరంతర అభ్యసన చేసే మహిళ ఉన్నత శిఖరాలను అధిరోహించ గలదు అన్నారు మొట్టమొదటిగా దేశంలో చదువులో సావిత్రిబాయిపూలే త్యాగంలో రమాబాయి, పోరాటంలో ఝాన్సీ రాణి, చాకలి ఐలమ్మ, ప్రేమలో మదర్ థెరిస్సా ఇలా చెప్పుకుంటూ పోతే నాటి నుండి నేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు మహిళలు దేశాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నారని అన్నారు. కరోనా టైంలో సేవలు అందించిన మున్సిపల్ సిబ్బంది కి మరియు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతినిధులకు కేక్ కటింగ్ చేసి శాలువలతో ఘనంగా సన్మానం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ కూరాకుల శ్రీనివాస్, రెండవ వార్డ్ కౌన్సిలర్ బాలమణి శ్రీనివాస్ రెడ్డి, పదవ వార్డ్ కౌన్సిలర్ రహీం, 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, 16వ వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ బొగ్గుల చందు, కో ఆప్షన్ మెంబర్ షరీఫా ఉమర్ మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.




