రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి బీరు సీసా తో మరో వ్యక్తిని తలపై కొట్టిన సంఘటనలు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన లింగాల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పాత భూపతి అనే వ్యక్తి పాత గొడవలు మనసులో పెట్టుకొని సోమవారం మాట మాట పెరిగి బీరు సీసాతో శ్రీనివాస తలపై బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.




