జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని బిసి స్టడీ సర్కిల్ సిద్దిపేటలో ఉచిత శిక్షణ పొందుతున్న గ్రూప్ 2 మరియు ఎస్ఐ, కానిస్టేబుల్ 75 రోజుల పాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ముజముల్లా ఖాన్ సందర్శించి స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వడానికి ఉన్న సౌకర్యాలను పరిశీలించి శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడి స్టడీ సర్కిల్ లో శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఉద్యోగాలలో స్థిరపడడానికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నాణ్యమైన ఉచిత శిక్షణను అందిస్తుందని శ్రద్ధతో క్లాసులను విని క్రమశిక్షణతో కష్టపడి చదివి మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ధైర్యంతో సాధించి కన్నవారి కలలను సాకారం చేయాలని శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సూచించారు. మరియు ఉద్యోగ సాధనకు కొన్ని మెలకువలు, సలహాలు ఇవ్వడం జరిగినది. అదనపుకలెక్టర్ తో పాటు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మా శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో ఉద్యోగం పొందాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ వక్త ఆజాద్ అహ్మద్ కూడా పాల్గొని విద్యార్థులకు వ్యాస రచనలో మెలకువలను నేర్పించారు. తదుపరి అదనపు కలెక్టర్ ఆజాద్ అహ్మద్ ను సన్మానించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.కృష్ణ దయాసాగర్ మరియు అధ్యాపకులు మరియు స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
