ముస్తాబాద్ జనవరి 26, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను శాంతి సమానత్వం వైపు నడిపించేలా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జూడో యాత్రను ప్రతి రాష్ట్రంలో ప్రతి గడపకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రను చేయాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాత్రను లాంచనంగా ప్రారంభించడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎన్నో మంచి పనులను ప్రతి గడపకు తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, జిల్లా కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సారగొండ రాంరెడ్డి, ఆవునూర్ గ్రామశాఖ అధ్యక్షులు బత్తుల నవీన్, నామపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గన్నె భాను రెడ్డి, కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గాంత రాజు, చికోడు గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, క్యారం రాజు ,తాలూకా దేవయ్య, కరెంట్ లో అమరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పెండ్యాల నారాయణరెడ్డి, కమ్మరి శ్రీనివాస్, తాలూకా సురేష్, తొండల శ్రీనివాస్, సారగొండ శ్రవణ్, భాను, కళ్యాణ్, యారటి భరత్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల విజయ్ రెడ్డి, శీల ప్రశాంత్, ఐదో వార్డ్ మెంబర్ సారుగు వెంకటేష్, NSUI మండల అధ్యక్షుడు సారుగు రాకేష్ సద్ది మధు తదితరులు పాల్గొన్నారు.
