ప్రాంతీయం

ప్రమాణాలు గాలికి.. నాణ్యతలేని నిర్మాణాలు… ప్రజాధనం వృధా పట్టించుకోని అధికారులు.. తోట ధర్మేందర్…

388 Views

ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన మురుకి కాలువల పనులు నెలరోజుల వ్యవధిలోనే కూలిపోవడం ఎందుకనో… ప్రజాధనాన్ని దుర్వునియోగం చేసిన కాంట్రాక్టర్లపై తగుచర్యలు తీసుకోవాలని గల్ఫ్ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ తోటధర్మేందర్ చూసి మండిపడ్డారు. మండలంలోని పోతుగల్ డబుల్ బెడ్ రూమ్ ఎస్సీ కాలనీలో గత నెలరోజుల క్రితం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ నాణ్యతలో లోపంతో కూలిపోయిందని స్థానికులు తోట ధర్మేందర్ కు వెల్లడించండతో ఆకాలనీలో పరిశీలించారు. ఆ పిదప ఆయన మాట్లాడుతూ ప్రజాధనం లక్షలు వెచ్చించి నిర్మించిన పనులను అధికారులు పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇస్టానుసారంగా నిర్మించారని ఆరోపించారు. ఓవైపు రాష్ట్రం అప్పుల్లో కూడుకపోతున్నా అధికారులకు పట్టనట్లుగా వ్యవహరించడంలో ఏం దాగిందోనని ఆశ్చర్యపడ నక్కర్లేదన్నారు. ఈ పనులు జరుగుతున్నప్పుడు స్థానికులు నాణ్యత లేకుండా పనులు జరుపుతున్నారని అథికారులకు విన్నవించిన పట్టించుకోలేదని స్థానికులు కూడా ఆరోపించారని తోటధర్మేందర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *