ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 26, బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో కెప్టెన్ రఘునదనరావు విగ్రహం ముందు 74 వ గణతంత్ర వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ జెండా ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల మండలం ఇంచార్జ్ మట్ట నరేష్, పట్టణ అధ్యక్షులు రుద్రవరపు సుజిత్ కుమార్,
నాయకులు అల్లే, గణేష్ పోతర్ల వంశీ, పోతర్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.


నాయకులు అల్లే, గణేష్ పోతర్ల వంశీ, పోతర్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.


