అక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
ఎనిమిది ఏళ్ల క్రితం కొద్దిమంది మిత్రులతో కలిసి రహీం బ్లడ్ డొనేషన్స్ సొసైటీని ప్రారంభించారు. రక్తం అవసరం ఉన్నవారికి సికిల్ సెల్, తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త నిధి కేంద్రాలలో రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నాం. ఏ ఆస్పత్రిలోనైనా రోగికి రక్తం అవసరం ఉందని సమాచారం అందిన వెంటనే స్పందించి వారికి తమ వంతు స్వయంగా రక్తాన్ని అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాం. ఇంతవరకు ఈ రహీం బ్లడ్ డొనేషన్ సొసైటీ ద్వారా 1800 మందికి రక్తాన్ని స్వచ్ఛందంగా అందజేశాం.
రహీం బ్లడ్ డొనేషన్ సొసైటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం.
రక్తదానం చేసి ప్రాణదాతలు అవుదాం.
