సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రామసాగర్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు రాగి చంద్రం చిన్న కొడుకు రాగి రాజు గత వారం రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, 6000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలోని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలు కుటుంబ సభ్యులను పరమర్శించి 8000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రామకృష్ణకొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ మల్లేశం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, నామసాని స్వామి, రాజు, కస్తూరి నవీన్, యాదగిరి, మల్లేష్, తుడుం ప్రశాంత్, తుప్పత్తి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Supar