-బాత్రూములు చెడిపోవడంతో వాటి మరమ్మత్తుల కోసం 20,000 వేలు అందించిన 2000-2001 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు
-బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు అవస్థలు
-5,000 వేల రూపాయల క్రీడా సామాగ్రి అందిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు
-ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బాత్రూంలు చెడిపోవడంతో విద్యార్థులు నానా.. అవస్థలు పడుతున్నారు అది గమనించిన 2000-2001 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు బాత్రూంలు బాగు చేయించడం కోసం ముందుకు వచ్చి తమ వంతుగా 20వేల రూపాయలు స్థానిక సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి చేతుల మీదుగా హెడ్మాస్టర్ సమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.5,000 వేల రూపాయలు క్రీడా సామాగ్రి కోసం అందిస్తామని తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ.. బొప్పాపూర్ ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పరంగా జిల్లాలో మూడో స్థానంలో, గ్రామపంచాయతీ పరంగా మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, రానున్న రోజుల్లో వివిధ గ్రామాల ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతాయని, విద్యార్థులకు ఎలాంటి లోటు పాటలు ఉన్న తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు, పూర్వ విద్యార్థులు పెంజర్ల శ్రీనివాస్,నాగుల శ్రీధర్,సంజీవ్ 20,000 రూపాయలు అందించినందుకు సర్పంచ్ , హెడ్మాస్టర్ వారిని అభినందించారు
