ముస్తాబాద్, ప్రతినిధి జూలై 24, మైదా పిండి పునుగుల ముక్కలు గొంతులో తట్టుకొని 13. నెలల బాబు మృతి.. పునుగులతో పసి బాలుడి ప్రాణము చిదిమేసింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో వలస వచ్చి కూలీలుగా జీవనము రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మారుతి కవిత దంపతుల కుమారుడు క్రాంతి కుమార్ 13.నెలలు సోమవారం సాయంత్రం పుణుగులు నోట్లో పెట్టుకుని మింగడంతో గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. రెండేళ్ళ క్రితం కొమరం బీమ్ జిల్లా కౌటాల మండలం వెర్దండి గ్రామానికి చెందిన వలస తల్లిదండ్రులు ఇటీవల బర్త్డే వేడుకలు జరుపుకుందామని అనుకున్న బాబు ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లాడు కళ్ళ ముందు అల్లరుముద్దుగా ఆడుకున్న కుమారుడు మృతి చెందడంతో కన్నతల్లి కవిత రోదనలు నిన్నంటాయి. గతములో ఒక కుమారుడు పుట్టి మరణించాడని ఇప్పుడు ఉన్న కుమారుడు మరణించడాని క్రాంతి తండ్రి మారుతి తెలిపారు. బాలుని మృత దేహంతో స్వగ్రామమైన వెర్దండి గ్రామానికి అంబులెన్స్ లో వెళ్లడంలో ఉన్నారు. బాబు మరణంతో పలువురిని కంఠతడి పెట్టింది. పోలీసులకు సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకొని సమాచారం పలు వివరాలు సేకరించి పెట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




