దౌల్తాబాద్: క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇన్చార్జి సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మహమ్మద్ ఖాజా బేగం జ్ఞాపకార్థంతో మండల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా ముందు ఉండాలని అన్నారు. రోజురోజుకు క్రీడలకు యువత దూరం అవుతూ అనేక రకాల శారీరక రుగ్మతలకు గురవుతున్నారని అన్నారు. క్రీడలు యువత లో మనోస్థైర్యాన్ని నింపుతాయని అన్నారు. అనంతరం బహుమతులను ప్రధానం చేశారు. ప్రథమ ఇందుప్రియల్, ద్వితీయ లింగరాజు పల్లి, తృతీయ దౌల్తాబాద్ జట్టు బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ప్రశాంత్, పవన్, బాబా, నాయకులు పోచమైన రాజు, కనకరాజు, మహేష్, గురువయ్య, భాను, రెడ్డి శ్రీనివాస్, తుమ్మల గణేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు….
