నిమ్మరాజుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
పాల్గొన్న రాష్ట్ర నాయకులు తోట రాజయ్య, ఓడేటి చంద్రశేఖర్, ఇంజన్ సాంబశివరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోతె రవీందర్
50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
మంచిర్యాల టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు నిమ్మరాజుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఈరోజు పరామర్శించి శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వారి భార్య పిల్లలను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర కార్యదర్శి ఓడేటి చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోతే రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది కొట్టే నటేశ్వర్, న్యాయవాది సూరమల్ల యశ్వంత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రచార కార్యదర్శి బూర ముక్తేశ్వర్, పెద్దపల్లి జిల్లా రామగిరి మండల అధ్యక్షులు సందెల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నాయకులు సుద్దాల పోచన్న, లవ కుమార్ తదితరులు పాల్గొని శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
