RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అధ్యక్షతన మంచిర్యాల జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల RGPRS ఇంచార్జి సుభాష్ యాకరాన్* పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సుభాష్ యాకరన్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామంలోని సమస్యలను స్థానిక నేతలు దగ్గరుండి పరిష్కరించాలన్నారు.
సమావేశ ముఖ్య అంశాలు:
రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న గ్రామీణ నాయకులను గుర్తించి అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలి.
పట్టణ, గ్రామీణ స్థానిక పాలనలో అనుభవం ఉన్న నాయకులతో మండలాల సమావేశం నిర్వహించాలి.
సర్వోదయ సంకల్ప 3 రోజుల శిబిరాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యమాలు నిర్వహించాలి.
పంచాయితీ చట్టాలను బలోపేతం చేసేలా ఆర్థిక సంస్కరణలు, ప్రణాళికలు రూపొందించాలి.*
ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ (RGPRS) నాయకులూ, మంచిర్యాల జిల్లా మాజీ… జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
