*రామగుండం పోలీస్ కమీషనరేట్*
అత్యాచార కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా రూ.2000/-.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ :20-02-2019 రోజున గోదావరిఖని శివాజీ నగర్ కి చెందిన ఫిర్యాదు దారులు తన పెద్ద కూతురు పుట్టిన అప్పటినుండి మతి స్థిమితం సరిగా ఉండక ఇంట్లోనే ఉండేది అట్టి అమ్మాయిని మా వాడగు చెందిన ఆకుల గట్టయ్య, 58yrs, కాపు, శివాజి నగర్ అనే వ్యక్తి యొక్క భార్య ఆకుల బొందమ్మా తన కూతురి డెలివరీ నిమిత్తం విదేశాలకు వెళ్ళగా ఆ సమయంలో గట్టయ్య ఫిర్యాదుదారురాలి మతిస్థిమితం సరిగా లేని తన పెద్ద కూతురుపై అత్యాచారానికి పాల్పడినాడని 11-02-2019 రోజున కడుపు నొప్పిగా ఉందని చెప్పగా హాస్పిటల్ తీసుకొని వెళ్ళగా డాక్టర్ సిటీ స్కానింగ్ చేయమని చెప్పడంతో సిటీ స్కానింగ్ చేపించగా 15 వారాల నాలుగు రోజుల గర్భవతి అని తెలిసినది. తన మతిస్థిమితం లేని కూతురు గర్భవతి అవ్వడానికి కారణమైన ఆకుల గట్టయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దరఖాస్తు మేరకు అప్పటి ఇన్స్పెక్టర్ పర్స. రమేష్ సెక్షన్ 376 2(l)(n) IPC ల ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి దర్యాప్తు నివేదిక కోర్టులో దాఖలు చేయడం జరిగింది.
కోర్టు లైజన్ ఆఫీసర్ హెడ్ కాన్స్టేబుల్ కొత్తకొండ శంకర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీ. జ్యోతి రెడ్డి, ఏ. రాములు, addl జిల్లా & సెషన్స్ కోర్టు గోదావరిఖని లో సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా అడిషనల్ జిల్లా సెషన్ కోర్టు గోదావరిఖని న్యాయమూర్తి టి. శ్రీనివాస్ రావు నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, మరియు రూ, 2000/- వేల జరిమానా విధించడం జరిగింది.
నిందితునికి శిక్ష విధించడంలో కృషిచేసిన గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీ. జ్యోతి రెడ్డి, ఏ. రాములు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ కొత్తకొండ శంకర్ ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్, పెద్దపల్లి డిసిపి కర్ణాకర్, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్ అభినందించారు.
