ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను దరువు ఎల్లన్నతో గుండార కృష్ణారెడ్డి, జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు వర్స కృష్ణ హరి చర్చించారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అంకితంతో పనిచేసే కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దరువు ఎల్లన్న సూచనలు ఇచ్చారు, దరువు ఎల్లన్న సన్మానించిన వారిలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు,
