Breaking News

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం

14 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం.

అంతర్జాతీయ యోగా దశబ్ధి ఉత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యోగాలో భాగంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ రక్షించుకోవడం కోసం యోగా అనేది ప్రకృతిలో ఒక భాగంగా భావిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా మానవ జీవనశైలికి కూడా ప్రకృతి చెట్లు అనేటివి మనకు ఎంతగానో తోడ్పడతాయి కావున ప్రతి ఒక్కరూ వృక్షో రక్షిత రక్షిత నట్టు అందరూ మన జీవన విధానం బాగుండాలి అంటే చెట్లు నాటడం ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా భావిస్తూ వాటిని రక్షించుకుంటూ వాటిని బాధ్యతగా మనం పెంచాలని యోగాలో భాగంగా అందరికీ తెలియజేస్తూ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్ ఏ. సుధాకర్ మరియు మేఘన మరియు నస్పూర్ గ్రామం ప్రాంత నివాసులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా సమ్మయ్య మరియు సత్యనారాయణ  మరియు నవ్య శ్రీ, ఆశ్రిత మొదలైన వారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్