Breaking News

అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

15 Views

మంచిర్యాల జిల్లా.

అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.

రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్  ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా పాన్ కార్డుని పరిగణలోకి తీసుకోకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి నిజమైన అర్హులకు రాజీవ్ వికాసం ఇవ్వాలని కోరుతూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని అన్నారు. సిబిల్ స్కోర్ కేవలం ఆర్థికంగా సమర్థులై ఉన్నవారు బ్యాంకులలో డబ్బులు ఉన్న వాళ్లకు మాత్రమే సిబిల్ స్కోర్ ఉండడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక బంగారం తగ్గట్టు పెట్టి అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం జరుగుతుంది మరి ఇలా డబ్బులు ఉన్నవాళ్లకే ఓ వికాసం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇదే విధంగా ఇల్లు లేని వారికి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో కేవలం కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకు మాత్రమే లిస్టులో చేర్చడం వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ దృష్టికి వచ్చిన లబ్ధిదారుల లిస్టులని మాకు అందజేస్తే అందులో ఎవరు అసలైన అర్హులు ఎవరు అర్హులు కారు అన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి వివరాలతో కలెక్టర్ కి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణ మూర్తి, జీవీ ఆనంద్ కృష్ణ, పులగం తిరుపతి, సత్రం రమేష్, అమిరిశెట్టి రాజు, బొలిశెట్టి అశ్విన్, కాశెట్టి నాగేశ్వర్ రావు, దీక్షితులు, మంత్రి రామన్న, సంజీవ్ రెడ్డి, ఈర్ల సదానందం, బుద్దారపు రాజమౌళి, కర్రె చక్రి, ఆకుల నరేందర్, బింగి సత్యనారాయణ, మల్కా రాజేశం, తడూరి మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్