(తిమ్మాపూర్ ఏప్రిల్ 05)
తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ చౌరస్తా సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి చిక్యాల సాగర్ రావు(69) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది..
కరీంనగర్ లోని రామచంద్రపూర్ కాలనీకి చెందిన సాగర్ రావు హుస్నాబాద్ సమీపంలోని గందిపెల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి తన స్నేహితులతో కలిసి కారులో కరీంనగర్ వైపు వస్తున్నాడు. నుస్తులాపూర్ వద్ద కూల్ వాటర్ బాటిల్ కొనేందుకు ముగ్గురితో కలిసి రోడ్డు దాటుతున్నాడు. రోడ్డు చివరన దాటుతున్న సాగర్ రావు ను హైదరాబాదు వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది.
ప్రమాదంలో సాగర్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిని కుమారుడు పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే రిటైర్డ్ అయిన సాగర్ రావు ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. మిత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామచంద్రాపూర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్ఐ చేరాలు చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.