రామగుండం పోలీస్ కమీషనరేట్
ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం
ఇటీవలే రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దుర్గ్యాల తిరుపతి హోంగార్డ్ గారి పెద్ద కుమారుడు అయిన దుర్గ్యాల అరుణ్ నీ కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్ళి రామగుండం కమీషనరేట్ MTO ఆర్ యి మల్లేశం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం నింపడం జరిగినది. అనంతరం రామగుండం కమిషనరేట్ నందు MT WING నుండి రూ.27,500 ల రూపాయలు, మరియు AR విభాగము నుండి రూ.32,000 ల రూపాయలు, మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ గ్రూప్ నుండి సేకరించిన రూ.17,500 మరియు ఆర్ ఐ మల్లేశం వారి తరుపున రూ.3000 మొత్తంగా రూ.80,000 ఈ రోజు దుర్గ్యాల తిరుపతి రజిత కు అందజేయడమైనది.
ఆర్ ఐ వెంట సిబ్బంది మైకాంత్,ఎర్ని రాజయ్య ఉన్నారు.
