దౌల్తాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నీళ్లు రాక విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా సంక్షేమ అధికారి సరోజ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నీళ్లు రాకపోవడానికి గల కారణాలను విద్యార్థులు, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, ఏఈ శరత్, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
