ప్రాంతీయం

విద్యార్థులకు అభినందన

105 Views

దౌల్తాబాద్: ఇటీవల భద్రాచలంలో జరిగిన క్రీడా పోటీలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు 6 ఇంటర్ సొసైటీ లీగ్ లో పాల్గొని 65 కేజీ కేటగిరి రోస్టిలింగ్లో ఐదు రౌండ్లలో గోల్డ్ మెడల్ సాధించిన రామాంజనేయులు, 75 కేజీ కేటగిరిలో బ్రాంచ్ మోడల్ సాధించిన రాహుల్, అలాగే రన్నింగ్ 4×400 మీటర్లలో శ్రీశైలం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా బిసి సంక్షేమ అధికారి సరోజ అభినందించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో మూడు నెలల నుండి ఫుట్ బాల్ క్యాంప్ నిర్వహించి వెళ్లిన అండర్ 17 గ్రూప్ ద్వితీయ స్థానం సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో పిడి వెంకటరెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh