రామగుండం పోలీస్ కమిషనరేట్.
ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి సన్నివేశం, పాటల రూపంలో వివరించారు.
ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్సై రవికాంత్ లు మాట్లాడుతూ… సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, హెల్మెట్ అవశ్యకతను తెలియజేశారు. బస్‌లలో ప్రయాణం చేసేటపుడు కిటికీల నుంచి చేతులు బయట పెట్టరాదని, లైసెన్సు లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దన్నారు. సిగ్నల్స్‌ను చూసి రోడ్డు దాటాలని, వాహనం నడిపేటపుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. కళాబృందం ప్రదర్శించిన సన్నివేశాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
