బి ఎస్ పి పిడిచేడ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ పిడిచేడ్ గ్రామ కమిటీ నాయకులు చంద్ర శేఖర్, రవి,అఖిల్ పాషా, స్వామి, యాదగిరి,రాకేష్, భాను ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ , జిల్లా ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ , గజ్వేల్ టౌన్ అధ్యక్షులు కోట మహేందర్ ,జగదేవపూర్ మండల అధ్యక్షులు కె. ఆర్. అశోక్ , కుకునూర్ పల్లి మండల అధ్యక్షులు కనకప్రసాద్ బి వి ఎ ఫ్ నాయకులు నాగరాజు, పరమేష్ ,పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు అని ,అన్ని మతాలు ,కులాల మధ్య సోదర భావం కలిగి ఉండేలా ఇఫ్తార్ విధులు పెంపొందిస్తాయని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం సోదరులను మోసం చేసిందని, బహుజన్ రాజ్యం లో బహుజనులందరికి తప్పకుండా తమ న్యాయ బద్ధమైన వాటా అందుతుందని అన్నారు.
