ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లపై నెత్తుటి దారాలు
వరంగల్ జిల్లా: ఫిబ్రవరి 21
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ విషయం లో కోర్టులో ప్రైవేటు కేసు వేసిన రాజ లింగమూర్తిని కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన ఘటన మరువక ముందే వరంగల్ నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది, ఎప్పుడు ఏమి జరుగు తుందోనని, వరంగల్ పట్టణ వాసులు భయాం దోళనకు గురవుతున్నారు.
తాజాగా వరంగల్ నగరం నడిరోడ్డుపై వైద్యుడిపై హత్య యత్నం జరిగింది వరంగల్ -బట్టుపల్లి రహదారిపై గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వైద్యుడు సిద్ధార్థ రెడ్డి పై అత్యంత దారుణం గా ఇనుపరాట్లతో దాడి చేశారు.
ఆయన వెళుతున్న కారు ను అడ్డగించి బయటకు లాగి దుండగులు రాడ్లతో దానికి దిగారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న డాక్టర్ సిద్ధార్థ రెడ్డిని, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
దాడికి పాల్పడింది ఎవరు?ఎందుకు దాడి చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
