శ్రీ శ్రీ వీరట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ కి పూజ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. బైకు ర్యాలీగా పురవీధులలో చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు బాల చారి, దుబ్బాక నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు నాగరాజు, కిషన్ చారి, శ్రీనివాస్ చారి, శివకుమార్, అశోక్ చారి, వెంకటేష్, రాజు చారి, యాదగిరి చారి, భాస్కర్ చారి,చంద్రం, సద్గుణ చారి,లక్ష్మణ్ చారి, ఉపేందర్, ప్రభాకర్,నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.
